
అడివిశేష్ , మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం డకాయిట్. ఈ సినిమాకు షానీల్ డియో కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్, రివేంజ్ డ్రామగా రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా ఒక అప్‌డేట్ పంచుకున్నారు.

ఈ సినిమాతో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా అనురాగ్ కశ్యప్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ గమనిస్తే, అనురాగ్ ఇందులో స్వామిమాల ధరించిన పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. తెలుగుతో పాటు హిందీలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అడివిశేష్ , మృణాల్ ఠాకూర్ మొదట ప్రేమికులుగా ఆ తర్వాత బద్ద శత్రువులుగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
