అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్తకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. దీంతో ఆయన్ను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. కమలా హారిస్ భర్త, దేశ రెండో పౌరుడు డగ్లస్ ఎమహాఫ్ వాషింగ్టన్‌లోని డన్‌బార్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బ్లాక్ హిస్టరీ మంత్ సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఐదు నిమిషాల పాటు పాఠశాల మ్యూజియంలో ఎమహాఫ్ ఉన్నారు. ఈ క్రమంలో ఆయన భద్రతా సిబ్బంది ఎమహాఫ్ వద్దకు వెళ్లి మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలి అని హూటాహుటిన బయటకు తీసుకెళ్లారు. ఈ బాంబు బెదిరింపుల విషయాన్ని వాషింగ్టన్ పబ్లిక్ స్కూల్స్ ప్రతినిధి ఎన్‌రిక్ గుటిరెజ్ వెల్లడిరచారు. ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని, అందరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ బెదిరింపులు ఎమ్‌హాఫ్ సందర్శనకు సంబంధించినవా? లేక బ్లాక్ హిస్టరీ మంత్ కార్యక్రమానికి సంబంధించిందా? అనేది స్పష్టంగా తెలియదని చెప్పారు. ఈ అంశంపై నిఘా వర్గాలు దర్యాప్తు చేపట్టాయి.














