Namaste NRI

టాక్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల జాతర

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో  బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హౌంస్లౌ నగర డిప్యూటీ మేయర్ మహ్మద్‌ షకీల్ అక్రమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్రమ్ మాట్లాడుతూ యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. విదేశాల్లో ఉన్నపటికి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందన్నారు. టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు.

రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ టాక్ సంస్థని అన్ని సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బోనం చేసి వేడుకల్లో పాల్గొన్న మహిళలం దరిని ప్రత్యేక సత్కరించి, బహుమతులందజేశారు. ప్రముఖ నృత్య కళాకారిణి రాగసుధ వింజమూరి చేసిన నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుంచి భారీగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. టాక్  అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల,ఉపాధ్యక్షుడు శుష్మణ రెడ్డి అధ్యక్ష తన ప్రారంభమైన వేడుకలకు వ్యాఖ్యాతగా సత్యమూర్తి చిలుముల వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిళ్లర్లు అజమీర్ గ్రేవాల్, ప్రీతమ్ గ్రేవాల్, సత్యం కంది, శ్రీకాంత్ జెల్ల, శ్రీధర్ రావు, మధుసూదన్ రెడ్డి, శైలజ జెల్ల,స్నేహ, శ్వేతా మహేందర్, స్వాతి, క్రాంతి, పవిత్ర, సుప్రజ, శ్వేత, శ్రీ విద్య, నీలిమ , పృధ్వీ, మణి తేజ, గణేష్ పాస్తం, నిఖిల్ రెడ్డి, హరి గౌడ్, నవీన్ రెడ్డి, కార్తీక్, రంజిత్, రాజేష్ వాక, మహేందర్, వంశీ, ఆనంద్, అక్షయ్, పావని, జస్వంత్, శివ వెన్న, నాగ్, మాడి, వినోద్, సన్నీ, సందీప్, ఆదేశ్ ఫర్మాహాన్, బంధన చోప్రా, అశోక్ దూసరి,  మట్టా రెడ్డి, వెంకట్ రెడ్డి, సురేష్ బుడగం, జాహ్నవి వేముల, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, రాకేష్ పటేల్, సత్యపాల్, మల్లా రెడ్డి, గణేష్ కుప్పాల, తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress