Namaste NRI

వచ్చే నెల నుంచి బూస్టర్ డోసు

సెప్టెంబర్‌ 20 నుంచి బూస్టర్‌ డోసులు ఇవ్వడం ప్రారంభమౌతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడిరచారు. ఎవరైతే రెండో డోసు తీసుకుని ఎనిమిది నెలలయిందో వారికి ఉచితంగా డోసులు అందజేయనున్నట్లు తెలిపారు. ఇతర దేశాలు మొదటి టీకా పొందేవరకు అమెరికా మూడో డోసు తీసుకోరాదని ప్రపంచ నేతలు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారని బైడెన్‌ పేర్కొన్నారు. అమెరికా ప్రజల భద్రతను చూడడంతో పాటు ప్రపంచ దేశాలకు కూడా ఇదే సహయంలో సహాయం చేస్తామని తెలిపారు. ప్రపంచంలో చాలా దేశాలు టీకా మొదటి డోసు కోసం నిరీక్షిస్తుండగా అమెరికన్లు అదనంగా డోసుల నుంచి రక్షణ పొందుతున్నారన్న విమర్శను బైడెన్‌ పట్టించుకోలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events