రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్ ఆక్రమణకు ముందు రోజు తనపై క్షిపణి ప్రయోగిస్తానని పుతిన్ హెచ్చరించినట్లు బోరిస్ తాజాగా వెల్లడించారు. వ్యక్తిగతంగా తనపైకి రాకెట్ను ప్రయోగించడానికి కేవలం ఒక్క నిమిషం చాలని పుతిన్ బెదిరించినట్లు వివరించారు. బోరిస్ నేను నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. కానీ క్షిపణితో దాడి చేసేందుకు ఒక్క నిమిషం చాలు అని హెచ్చరించినట్లు చెప్పారు.
ఉక్రెయిన్పైకి సైన్యాన్ని పంపించడానికి ముందు రోజు పుతిన్ నాకు ఫోన్ చేశారు. తన శత్రువు (ఉక్రెయిన్)కు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేస్తే రాకెట్ దాడికి వెనుకాడనని పుతిన్ హెచ్చరించారు అని జాన్సన్ తెలిపారు. అయితే పుతిన్ వ్యాఖ్యలకు తాను బెదిరిపోలేదని, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి మద్దతివ్వడానికే మొగ్గు చూపానని వెల్లడించారు.