Namaste NRI

ఇరు దేశాలు ప్రయత్నించాలి.. ఒప్పందం కుదిరేవరకూ అవి ఆగవు

భారత్‌, చైనా మధ్య ఒప్పందం కుదిరేవరకూ సరిహద్దు విషయంలో ఘర్షణలు జరుగుతూనే ఉంటాయని భారత్‌ ఆర్మీ చీఫ్‌ ఎమ్‌ ఎమ్‌ నరవణె పేర్కొన్నారు. పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఫ్టానిస్థాన్‌ పరిణామాలపై కూడా స్పందించిన ఆయన భారత ఆర్మీ అక్కడి పరిస్థితిని కూడా పరిశీలిస్తోందని తెలిపారు. అక్కడి స్థితిగతులను ఎప్పటికప్పుడూ అంచనా వేస్తూ తగు వ్యూహాలను రచిస్తామని తెలిపారు. చైనాతో సరిహద్దు వివాదం ఇంకా అపరిష్కృతంగానే ఉంది. గతంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా ఎదుర్కునేందుకు మేం సిద్ధంగానే ఉన్నాం. ఈ అంశంలో ఇరు దేశాల మధ్య ఓ ఒప్పందం కుదిరేవరకూ ఘర్షణలు జరిగే అవకాశం  ఉంది. కాబట్టి సుస్థిర శాంతి స్థాపన కోసం ఇరు దేశాలు ప్రయత్నించాలి అని ఆయన పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events