మల్లేశం హీరోగా నటించిన చిత్రం బ్రహ్మచారి. నర్సింగ్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని రాంభూపాల్ రెడ్డి నిర్మించా రు . ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. నిర్మాత మాట్లాడుతూ తెలంగాణ నేపథ్యంలో నడిచే కామెడీ కథ ఇది. ప్రతి సన్నివేశం సహజంగా ఉంటుంది. ఊరిలో రచ్చబండ దగ్గర కూచుని మాట్లాకున్నట్లే అనిపిస్తుంది అన్నారు. ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్విస్తుందని దర్శకుడు పేర్కొన్నాడు. స్వప్న, సిరి, రోషిణి, రజాక్ తదితరు లు నటిస్తున్నారు. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది.ఈ చిత్రానికి కెమెరా: కర్ణ ప్రియాసన్, సంగీతం: పాండురంగ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నర్సింగ్.