మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో అమెరికన్ అథ్లెట్ సిడ్నీ మెక్‌లాలిన్ ప్రపంచ రికార్డు ప్రదర్శనతో ఆకట్టుకుంది. టోక్యోలో జరిగిన 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్‌లో 51.46 సెకన్లలోనే గమ్యాన్ని చేరి గతంలో తన పేరిట ఉన్న రికార్డును చెరిపేసింది. గత ఒలింపిక్స్‌లో ఇదే పోటీలో స్వర్ణం పొందిన యూఎస్‌కే చెందిన దలైలా 51.58 సెకన్లలో పరుగు పూర్తి చేసి రజతం నెగ్గగా, ఫెక్మె (52.03 సె) కాంస్యం సొంతం చేసుకుంది.