కరోనాలో కొత్త రకమైన ఒమిక్రాన్ వివిధ దేశాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో విదేశీ ప్రయాణికులపై మళ్లీ ఆంక్షలు మొదలవుతున్నాయి. అమెరికా ప్రభుత్వం తమ దేశానికి రావాలనుకున్న వారు తప్పనిసరిగా కరోనా టెస్టులో నెగెటివ్ వచ్చినట్టు చూపించాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా బ్రిటన్ ప్రభుత్వం కూడా అగ్రరాజ్యం పంథానే ఎంచుకుంది. వివిధ దేశాల నుంచి బ్రిటన్‌కు వచ్చేవారందరికీ కరోనా నెగిటివ్ రిపోర్టులు తప్పనిసరి చేసింది. బ్రిటన్ వెళ్లేవారు తమ ప్రయాణానికి ఒకటి లేదా రెండు రోజుల లోపలే కరోనా టెస్టు చేయించుకుని నెగెటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంటుంది. అంతకుముందు చేయించుకున్న రిపోర్టులను అధికారులు అనుమతించరు. ఇక ఆఫ్రికా దేశం నైజీరియా నుంచి వచ్చేవారు తప్పనిసరిగా బ్రిటన్‌లో క్వారంటైన్‌కు పరిమితమవ్వాలి. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ కీలక ప్రకటన చేశారు. మరోవైపు ఒమ్రైకాన్ వ్యాప్తి కట్టడికి ఆంక్షలు అవసరమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)