బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేసేందుకు నిరాకరించారు. తనపై ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 2020`21 కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో ప్రధాని నివాసం ఉండే డౌనింగ్ స్ట్రీట్‌తో పాటు మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కొవిడ్ ఆంక్షలను ఉల్లంఘించి నిర్వహించిన పార్టీలకు ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రధాని రాజీనామాకు తిరస్కరించారు. అయితే, తెలిసీ పార్లమెంటును తప్పుదారి పట్టిస్తే మంత్రులు తమ పదవులను కోల్పోవాలనే నియమం తననూ వర్తిస్తుందని అంగీకరించారు. బోరిస్ రాజీనామాకు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఆరోపణలపై విచారణ చేపట్టినట్టు లండన్ మెట్రో పాలిటన్ పోలీసులు ప్రకటించారు. ఈ విచారణను ప్రధాని బోరిస్ జాన్సన్ స్వాగతించారు.














