బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను పెంపుడు కుక్క చిక్కుల్లో పడేసింది. తన పెంపుడు శునకం వల్ల ప్రధాని అంతటి వ్యక్తి చివరికి పోలీసులతో చెప్పించుకోవాల్సి వచ్చింది. తన కుటుంబ సభ్యులతో కలిసి రిషి సునాక్ రాజధాని లండన్‌లోని హైడ్ పార్క్‌కు వెళ్లారు. ఆ సమయంలో ప్రధాని దంపతులు తమతో పాటు పెంపుడు శునకాన్ని కూడా తీసుకెళ్లారు. అయితే, పార్క్‌కు వెళ్లిన తర్వాత కుక్క మెడకు ఎలాంటి గొలుసులు కట్టకుండా ఫ్రీగా వదిలేశారు. ఇది అక్కడి నిబంధనలకు విరుద్ధం. దీనిని గమనించిన పోలీసులు వెంటనే ప్రధాని వద్దకు చేరుకుని నిబంధనల చిట్టా విప్పడంతో పాటు కుక్క మెడకు పట్టీ పెట్టి అందించారు. అయితే, ప్రధాని రిషి రూల్స్ బ్రేక్ చేయడం ఇదే తొలిసారేమి కాదు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టకముందు కూడా పలుమార్లు ఆయన తన వైఖరితో విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి.