Namaste NRI

బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ యూ టర్న్ …సంపన్నులపై

సంపన్నులపై పన్నుల భారం తగిస్తానని హామీ ఇచ్చిన బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ నెల రోజులు తిరక్కముందే యూ టర్న్‌ తీసుకున్నారు. సంపన్నులపై భారీ పన్నులను తొలగించడానికి ఉద్దేశించిన విధానాన్ని ఉపసంహరించుకున్నారు. మార్కెట్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు తోడు ఈ విధానంపై అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నుంచే విమర్శలు రావొచ్చన్న భయాల నేపథ్యంలోనే ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఛాన్సరల్‌ క్యాసీ క్వార్టెంగ్‌ గత నెలలో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌లో అధికాదాయ వర్గాలపై 45 శాతం పన్ను వసూలు చేయడాన్ని రద్దు చేయనున్నట్లు ప్రతిపాదించారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి ఈ నిర్ణయం అమలులోకి రావాల్సి ఉంది.

అయితే ప్రభుత్వ రుణాలు పెరగడం, డాలర్‌తో పోలిస్తే పౌండ్‌ విలువ క్షీణించడం, పింఛను చెల్లింపులకు నిధుల కొరత తదితర పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రతిపాదనను వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. మన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, పౌర  సేవల్లో ప్రపంచ ప్రమాణాలు అందుకోవడానికి, వేతనాల పెరుగుదలకు, అవకాశాలు సృష్టించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదంటూ సమర్థించుకున్నారు. సంపన్నులపై అధిక పన్నుల రద్దుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని  ప్రధాని ట్రస్‌ చెప్పిన మారునాడే మడమ తిప్పడం చర్చనీయాంశమైంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events