నితిన్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం తమ్ముడు. శ్రీవెంకటేశ్వర క్రియే షన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో మొద లైంది. ఇందులో భారీ యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారని, దాదాపు 100 మందికిపైగా ఫైటర్స్ బృందం పాల్గొం టున్నదని సమాచారం. దాదాపు పదిరోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుందని తెలిసింది. దిల్, శ్రీనివాస కల్యాణం వంటి సినిమాల తర్వాత దిల్‌రాజు సంస్థలో నితిన్ చేస్తున్న ఈ సినిమా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. నితిన్ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్నది.