Namaste NRI

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి

రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఎన్‌ఆర్‌ఐ బీఆర్ఎస్‌ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. బహ్రెయిన్‌లోని అండాలస్‌ గార్డెన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. వందరోజుల కాంగ్రెస్‌ పాలన లో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పంటలకు నీరందక రైతులు, తాగునీరు అందక సతమతమవుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మార్పు తెస్తామంటే నమ్మి ప్రజలు అధికారం అప్పగిస్తే పాలన చేతగాక చేతులెత్తేసారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కు ఎలాంటి మేలు చేయలేదని ఆరోపించారు. పార్లమెంట్‌లో తెలంగాణ గళం విప్పాలంటే బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

పేదలకు పింఛన్లు   అందడం లేదని ఎన్నికల ప్రచారంలో అధినేత కేసీఆర్‌ కు లబ్దిదారులు మొరపెట్టుకుం టున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని తెలిపారు. పదేండ్లు కరువు లేదు. నిండా నీటితో జలాశయాలు. కాంగ్రెస్‌ పాలన  లో నాలుగు నెలలకే మళ్లీ కరువును చూస్తున్నాం అని అన్నారు.  ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్, ప్రధాన కార్యదర్శులు పుప్పాల బద్రి, అన్నారం సుమన్‌, మరుపాక దేవయ్య , తిప్పారవేణి శ్రీనివాస్ , మెరుగు శ్రీనివాస్, కొందరి రాజేందర్,  కార్య దర్శులు చెన్నమనేని  రాజేందర్, బొలిశెట్టి ప్రమోద్, చిలుకూరి రాజలింగం, పెనుగొండ శ్రీకాంత్ , స్వామి,  కోటగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events