Namaste NRI

భారత టెకీలకు బంపర్ ఆఫర్

అమెరికా టెక్‌ సంస్థ యూఎస్‌టీ ఇండియాలో భారీ ఎత్తున నియామకాలు చేపట్టేందుకు సిద్ధమైంది. సంస్థకు చెందిన బెంగళూరు, హైదరాబాద్‌ కార్యాలయాల్లో 2023 కల్లా పెద్ద ఎత్తున సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను నియమించుకోనుంది. ప్రస్తుతం యూఎస్‌టీ బెంగళూరు కార్యాలయంలో 6 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంఖ్యను 12 వేలకు చేర్చేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందించకుంది. వచ్చే 18` 24 నెలల్లో బెంగళూరు సెంటర్‌లో ఫ్రెషర్లు, అనుభవజ్ఞులను నియమించుకుంటాము. హెల్ల్‌కేర్‌, లాజిస్టిక్స్‌, సెమీ కండక్టర్స్‌, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్సిషయల్‌ విభాగాల్లో కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటాం అని సంస్థ ఓ ప్రకటనలో తేలిపింది. యూఎస్‌టీ హైదరాబాద్‌ శాఖలో ప్రస్తుతం 1000 మంది పనిచేస్తుండగా మరో రెండేళ్లలో అదనంగా వెయ్యి మందిని  నియమించుకునేందుకు కూడా కంపెనీ సిద్ధమవుతోంది.

                అమెరికాకు చెందిన యుఎస్‌టీ కంపెనీకి కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో ఆ కంపెనీకి మొత్తం 35 కార్యాలయాలు ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, చెన్నై, తిరువనంతపురం, కొచ్చి, పుణె, కోయింబత్తూరు, హోసూర్‌, ఢల్లీి నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌లో యూఎస్‌టీ కంపెనీకి డెడికేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ డెలివరీ సెంటర్‌లు ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events