యూఏఈ నుంచి భారత్‌కు వచ్చే వారికి షార్జాకు చెందిన లో కాస్ట్ క్యారియర్ ఎయిర్ అరేబియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 250 దిర్హమ్ (రూ.5,087)తో ఇండియాకు వచ్చే అవకాశం కల్పించింది. యూఏఈ నుంచి భారత్‌లోని 13 నగరాలకు ఈ ప్రత్యేక వన్‌వే సర్వీసులను నడిపిస్తామని ఎయిర్ అరేబియా ప్రకటించింది. ఈ జాబితాలో నాగ్‌పూర్, కోయంబత్తూర్, చెన్నై, త్రివేండ్రం, కొచ్చి, కాలికట్, గోవా, అహ్మదాబాద్, బెంగళూరు, జైపూర్, హైదరాబాద్, ముంబై, న్యూఢల్లీి ఉన్నాయి. యూఏఈ నుంచి ఈ గమ్యస్థానాలకు విమాన చార్జీల ప్రారంభ ధర కేవలం రూ.5 వేలు మాత్రమే అని ప్రకటించింది.
విదేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరూ తప్పనిసరిగా 7 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రకటన అనంతరం విమాన చార్జీలు అమాంతం తగ్గిపోయినట్లు దుబాయ్‌లోని ట్రావెల్ ఏజెంట్లు వాపోయారు.