అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట నాయకానాయికలుగా నటించిన చిత్రం బుట్టబొమ్మ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. మాటింటే మనిషిని చూడాలనిపించాలి. మాట్లాడుతుంటే పాట ఇంటున్నట్టుండాలి వంటి సంభాషణలు టీజర్‌లో ఆకట్టుకున్నాయి. దర్శకుడు శౌరి చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. ప్రతి పాత్ర గుర్తుండిపోతుంది. ప్రేమలోని సున్నితమైన పార్శాల్ని ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది అని తెలిపారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం అన్నారు. శౌరి చంద్రశేఖర్ దర్శకుడు. నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: వంశీ పచ్చిపులుసు, సంగీతం: గోపిసుందర్, మాటలు: గణేష్ కుమార్ రావూరి, ప్రొడక్షన్ డిజైనర్: వివేక్ అన్నామలై, దర్శకత్వం : శౌరి చంద్రశేఖర్ రమేష్.