చైతన్యరావు, భూమిశెట్టి జంటగా రూపొందిన చిత్రం షరతులు వర్తిస్తాయి. ఈ చిత్రానికి కుమారస్వామి దర్శకుడు. నాగార్జున సామల, శ్రీష్కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మాతలు. చిత్ర యూనిట్ ప్రమోషన్ని వేగవంతం చేసింది. ఆ చిత్రంలో కాలం సూపుల గాలంరా అంటూ సాగే గీతాన్ని చిత్రయూనిట్ విడుదల చేశారు. దిగ్గజ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి చేతులమీదుగా ఈ పాటను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కూడా పాల్గొన్నారు. గోరేటి వెంకన్న సాహిత్యాన్ని అందించగా అరుణ్ చిలువేరు స్వరపరిచిన ఈ గీతాన్ని రామ్ మిర్యాల ఆలపించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్సభ్యులకు కీరవాణి, మామిడి హరికృష్ణ శుభాకాంక్షలు అందించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.














