ఉన్నత చదువుల కోసం యూకేకు వెళ్లటానికి భారతీయులు ప్రస్తుతం ఆసక్తి కనబర్చటం లేదు. విశ్వవిద్యాల యాలు, కళాశాలల అడ్మిషన్స్ సర్వీస్ (యూసీఏఎస్) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. మాస్టర్స్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసిన భారతీయ విద్యార్థుల సంఖ్య 2022తో పోలిస్తే 2023లో 16 శాతం తగ్గింది. నికర వలసలు 10 శాతం తగ్గాయి. అయితే స్టూడెంట్ వీసాలపై వచ్చే విదేశీ విద్యారులు చెల్లించే ఫీజులపై ఆధారపడే బ్రిటిష్ విశ్వవిద్యాలయాలు ఈ పరిణామాల పట్ల ఆందోళనకు గురవుతున్నాయి. పోస్ట్ స్టడీ వర్క్ వీసాపై ఆంక్షలు, విద్యార్థులు తమ వెంట కుటుంబసభ్యులను తీసుకు రావడంపై ప్రభుత్వం నియంత్రణ విధించడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది.