Namaste NRI

భారతీయులకు కెనడా మరో షాక్‌.. తాత్కాలిక వీసాలు రద్దు

భారతీయులకు జారీచేసిన తాత్కాలిక వీసాలను మూకుమ్మడిగా రద్దు చేయాలని కెనడా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. పార్లమెంట్‌ ఆమోదం కోసం ఎదురుచూస్తున్న ఓ బిల్లు ప్రకారం కొవిడ్‌-19 వంటి మహమ్మారి లేదా యుద్ధ సమయాలలో విదేశీయులకు మంజూరు చేసే తాత్కాలిక వీసాలను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే కెనడా ప్రభుత్వం మాత్రం ప్రత్యేకించి కొన్ని దేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ అధికారాలను ప్రయోగించాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. విధానంలోని లోపాలను ఉపయోగించుకుని మోసపూరితంగా తాత్కాలిక వీసాలు పొందకుండా అడ్డుకునే అధికారాలను కూడా ఈ బిల్లులో పొందుపరచాలని కెనడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

కెనడా ప్రభుత్వం ప్రత్యేకంగా భారత్‌, బంగ్లాదేశ్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొంది. తాత్కాలిక నివాసులలో ఉద్యోగులు, అంతర్జాతీయ విద్యార్థులతోపాటు సందర్శకులు కూడా ఉంటారు. కెనడా సరిహద్దులను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్‌కు సమర్పించింది. సంబంధిత మంత్రికి అపారమైన అధికారాలను కట్టబెట్టే స్ట్రాంగ్‌ బార్డర్స్‌ బిల్లుకు లిబరల్‌ ప్రభుత్వం ఆమోదించిన పక్షంలో వీసా దరఖాస్తులు భారీ స్థాయిలో రద్దయ్యే అవకాశం ఉందని ఇమిగ్రేషన్‌ న్యాయవాది సుమీత్‌ సేన్‌ గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. శాశ్వత, తాత్కాలిక వలసలకు అడ్డుకట్ట వేయాలని కెనడా ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం కోసం వేచి ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events