Namaste NRI

భారతీయులను వెనక్కి పంపిన కెనడా

తమ దేశంలోని అక్రమ భారత వలసదారులను కెనడా ప్రభుత్వం నిశ్శబ్దంగా తొలగించింది. 2025లోని మొదటి 10 నెలల్లో మొత్తం 18,500 మంది విదేశీయులను వెనక్కి పంపగా, అందులో 2,500 మందికి పైగా భారతీయులు ఉన్నారు. కెనడియన్‌ బోర్డర్‌ సర్వీసెస్‌ ఏజెన్సీస్‌ (సీబీఎస్‌ఏ) విడుదల చేసిన డాటా ప్రకారం 2025, అక్టోబర్‌ వరకు 18,785 మంది అక్రమ వలసదారులను ప్రభుత్వం తొలగించగా, ఇంకా 29,542 మందిని వదిలించుకునే పనిలో ఉంది. ఇలా తొలగిస్తున్న వారిలో అధికులపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

కెనడా నుంచి బహిష్కరణకు గురైన వారిలో మెక్సికన్లు మొదటి స్థానంలో, భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. ఇప్పటివరకు 3,972 మంది మెక్సికన్లను, 2,831 మంది భారతీయులను కెనడా ప్రభుత్వం వెనక్కి పంపింది. ప్రస్తుతం కొనసాగుతున్న తొలగింపు ప్రక్రియలో ఇంకా 6,515 మంది భారతీయులు ఉన్నారని డాటా వెల్లడించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events