విదేశీ పర్యాటకులకు దేశీయంగా తాత్కాలిక వర్క్ పర్మిట్లు నిలిపివేస్తూ కెనడా కీలక నిర్ణయం తీసుకున్నది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. కెనడాలో వర్క్ పర్మిట్ కోసం విదేశీ పర్యాటకులు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ఉపసంహరిస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్ రిప్యూజీస్ అండ్ సిటిజన్ షిప్ కెనడా (ఐఆర్సీసీ) పేర్కొంది. కరోనా మహమ్మారి తర్వాత పెరిగిపోతున్న తాత్కాలిక ఇమ్మిగ్రేషన్లను తగ్గించేం దుకు కెనడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలోని కంపెనీలు తక్కువ వేతనాలకు పని చేసే తాత్కాలిక విదేశీ వర్కర్లకు తక్కువ శాతం అనుమతులిస్తుంది. లేబర్ మార్కెట్ మారిపోయింది. కెనడా వర్కర్లు, యువత కోసం వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాల్సిన సమయం అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి వేళ ప్రయాణాలపై ఆంక్షల నేపథ్యంలో దేశాన్ని వీడలేని విదేశీ పర్యాటకుల కోసం కెనడా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్, రిప్యూజీస్, కెనడా సిటిజన్ షిప్ (ఐఆర్సీసీ) విదేశీ పర్యాటకులకు తక్కువ వేతనాలపై తాత్కాలిక వర్క్ పర్మిట్ల విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం కింద విదేశీ పర్యాటకులు కెనడాను వీడకుండా వర్క్ పర్మిట్ కోసం దేశంలోనే పని చేసుకోవచ్చు. దీని ప్రకారం విదేశీ పర్యాటకులు పని చేస్తున్న కంపెనీ యాజమాన్యాల వద్ద పని చేస్తున్నంత కాలం వారికి విదేశీ పర్యాటకుల హోదా కల్పిస్తోంది కెనడా. ఈ వర్క్ పర్మిట్ తో గత 12 నెలలు పని చేసి, తాజాగా కొత్త వర్క్ పర్మిట్ అప్లికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే వేచి ఉండాల్సి ఉంటుంది. 2025 ఫిబ్రవరి 28 నాటికి విదేశీ పర్యాటకులకు ఈ తాత్కాలిక వర్క్ పర్మిట్ పాలసీ ముగిసిపోనున్నదని ఐఆర్సీసీ తెలిపింది.