డ్రాగన్ కంటీ దిమ్మ తిరిగిపోయేలా నిర్ణయం తీసుకుంది ఉత్తర అమెరికా దేశం కెనడా. ఈ మేరకు ప్రధాని జస్టిస్ ట్రూడో ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. ఇండో`పసిఫిక్ ప్రాంతంలో వాణిజ్య సంబంధాల బలోపేతం కోసం భారీగా వెచ్చించనున్నట్లు కెనడా ప్రకటించింది. తద్వారా ఈ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని బాగా తగ్గించాలనే ఆలోచనలో కెనడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాదు ఈ ప్రభావంతో ఈ రీజియన్‌లో తమ బలాన్ని పెంచుకోవాలని కూడా భావిస్తోంది. ఈ మేరకు విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కీలక ప్రకటన చేశారు. కెనడా తన పసిఫిక్ వాణిజ్య సంబంధాలను చైనాకు మించి విస్తరించడానికి చాలా కష్టపడుతోంది. ఈ క్రమంలో అమెరికా తర్వాత చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్మామిగా ఉంది. ఇప్పుడు ఆ స్థానంపై కెనడా కన్నేసినట్లు స్పష్టమవుతోంది. తాజాగా ఇండో పసిఫిక్ వ్యూహంలో భాగంగా కెనడా తరపున 1.7 బిలియన్ డాలర్ల ఖర్చు చేయబోతున్నట్లు మెలానీ జోలీ ప్రకటించారు. ఆ డబ్బును ఇండో`ఫసిఫిక్ రీజియన్‌లో మరింత నౌకాదళ గస్తీ కోసం, మెరుగైన నిఘా కోసం, సైబర్ సెక్యూరిటీ చర్యలకు ఉపయోగించనున్నట్లు ఆమె తెలిపారు. తూర్పు`దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో భాగస్వాముల మధ్య సహకారాన్ని పెంపొందించుకోడానికి ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
