శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినాన తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
మూడు రోజు పర్యటన నిమిత్తం భారత్‌కు విచ్చేసిన నేపాల్ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవ్బాతో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ సంస్కృతిక మహోత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు.
భారత పర్యటనలో ఉన్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోస్ కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌తో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా భారత్, రష్యాల పరస్పర సహకారంపై చర్చించారు. ఉక్రెయిన్‌లో తాజా పరిస్థితుల గురించి మాట్లాడుకున్నారు.
జనగణమన చిత్రబృందం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఢిల్లీలో కలిసింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు పూరీ జగన్నాథ్, నటుడు విజయ్ దేవరకొండ, ఛార్మీ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో.. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.
మహావీర్ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నోయిడాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఐటిబిపి సిబ్బంది తో విశ్వ సుందరి హర్నాజ్ కౌర్.
నిజాంపేటకు చెందిన నాసికా చిత్రకారుడు సత్యవోలు రాంబాబు ఆర్ఆర్ఆర్ చిత్ర కథానాయకులు రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి చిత్రాలను ముక్కు ద్వారా పోస్టర్ కలర్స్‌లో గీశారు.