తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు లండన్లో ఘనంగా జరిగాయి. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని, ఇలాంటి నాయకుడు ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టమని అన్నారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించాలని ఎదురుచూస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండి తెలంగాణను మరింత అభివృద్ధి చేయూలని, దేవుడి ఆశీస్సులు ఎల్లపుడూ వారికి ఉండాలని ఆకాంక్షించారు.
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నేడు ప్రపంచమంతా జరుగుతున్నాయని, తమకెంతో గర్వంగా ఉందని అన్నారు. అనంతరం ఎన్నారై టీఆర్ఎస్ యూకే ప్రధాన కార్యదర్శి, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ సర్వమత ప్రార్థనలు చేసిన సీఎం కేసీఆర్ ఆశీర్వదించిన అన్ని మతాల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. తాము వేడుకలకే పరిమితం కాలేదని, తెలంగాణ రాష్ట్రంలో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సుమారు రెండువందలకు పైగా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ కార్యకర్తలు, ఇతర ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.