విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విమాన ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సర్క్యూలర్‌ని జారీ చేసింది. అక్టోబర్ 18 నుంచి దేశీయంగా విమాన ప్రయాణాలపై ఉన్న ఆంక్షలు తొలగిపోనున్నాయి. అయితే కోవిడ్ తగ్గుముఖం పడుతుంటంతో క్రమంగా ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తి వేస్తూ వస్తున్నారు. విమాన ప్రయాణాలపై సెప్టెంబరు 18 మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. వాటి ప్రకారం 85 సామర్థ్యంతో మాత్రమే ప్రయాణికులకు అనుమతించారు. తాజాగా ఇచ్చిన గైడ్‌లెన్స్ ప్రకారం ఇకపై విమానాలు వంద శాంత సీటింగ్ కెపాసిటీతో నడిపించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అక్టోబరు 18 నుంచి విమానయాన సంస్థలు వంద శాతం టిక్కెట్లను విక్రయించనున్నాయి. విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో ఫ్లైట్ ఆపరేటర్లు పూర్తి స్థాయిలో టిక్కెట్లు విక్రయించడం లేదు. దీంతో సమయానికి టిక్కెట్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ సమస్య తీరనుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)