కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం నేపథ్యంలో జనవరి 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, వివిధ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు ప్రత్యేక సర్వీసులు కొనసాగుతాయని తెలిపింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కావాల్సి ఉంది. ఒమిక్రాన్ ప్రభావంతో పలు దేశాలు అతలాకుతలమవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ సర్వీసుల పునరుద్ధరణ నిర్ణయాన్ని కేంద్రం పక్కన బెట్టింది. అయితే, అంతర్జాతీయ రవాణా సర్వీసులకు వర్తించదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. ఎంపిక చేసిన అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులను అనుమతించొచ్చునని పేర్కొన్నది.