కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 156 దేశాల పౌరుల కోసం ఈ` టూరిస్ట్ వీసాను అమలులోకి తీసుకువచ్చింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ టూరిస్ట్ వీసాల జారీని 2020 మార్చిలో నిలిపి వేశారు. ప్రస్తుతం జారీ చేయనున్న టూరిస్ట్ వీసాలు ఐదేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటాయని పేర్కొంది. అయితే, అమెరికా, జపాన్ పౌరుల దీర్ఘకాలిక (పదేళ్ల) రెగ్యులర్ టూరిస్ట్ వీసాలను సైతం పునరుద్ధరించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం టూరిస్ట్ వీసా ఉన్న విదేశీయులెవరికీ రోడ్డు మార్గం లేదా నదీ మార్గం ద్వారా భారత్లో ప్రవేశించేందుకు అనుమతి ఉండదు. కేవలం ఎయిర్ పోర్టు లేదా సముద్ర మార్గంలో మాత్రమే వారు దేశంలో కాలు పెట్టాల్సి ఉంటుంది. ఇక అఫ్ఘాన్ జాతీయులకు ఈ నిబంధనలు ఏవీ వర్తించవని, వారి విషయంలో గతంలో ఉన్న ప్రత్యేక మార్గదర్శకాలే అమల్లో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది.