
న్యూజిలాండ్‌లోని తెలంగాణ సంఘం (తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్) నూతన అధ్యక్షుడిగా కోడూరి చంద్రశేఖర్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రానికి చెందిన ఆయనను న్యూజిలాండ్‌లో జరిగిన సంఘం సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా బాల విశ్వనాథ్, కార్యవర్గ సభ్యులుగా బాలకుల్ల శైలజ, యాచమనేని విజేత, ఎర్ర మధుకుమార్, కావ్య, శశికాంత్, వర్ష, లింగం, స్వాతి, విజయ్ తదితరులు ఎన్నికయ్యారు. న్యూజిలాండ్‌లోని తెలంగాణ కుటుంబాలకు, ప్రవాస భారతీయుల కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటానని చంద్రశేఖర్ పేర్కొన్నారు.















