Namaste NRI

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) నూతన కార్యవర్గం, అధ్యక్షునిగా చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి

2025 జనవరి 5 వ తేదీన డాలస్ లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ నూతన కార్యవర్గం ఏర్పాటువిశేషాలు ..

 శ్రీ చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి అధ్యక్షునిగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం( టాంటెక్స్ ) నూతన కార్యవర్గం ఏర్పాటుచేయడం జరిగిందని తెలియ చేయడానికి సంతోషిస్తున్నాము. తెలుగు భాష సాహిత్య సాంస్కృతిక రంగాలకు ఎప్పుడూ పట్టం కట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ 2025 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 5 వ తేదీన డాలస్ లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీ చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి సంస్థ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు .ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ వంటి గొప్ప సంస్థకు అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ఉత్తర అమెరికాలోని ప్రతిష్టాత్త్మకమైన ఈ టాంటెక్స్ సంస్థ ను ముందుండి నడప వలసిన బాధ్యతను తన మీద పెట్టినందుకుఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు . పదవీ విరమణ చేస్తున్న 2024 పాలకవర్గము మరియు బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కు కృతజ్ఞతాభినందనలు తెలియచేసిన పిమ్మట క్రొత్త కార్య నిర్వాహక బృందానికీ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సభ్యులకూ ఆహ్వానం పలికారు చంద్ర శేఖర్ రెడ్డి పొట్టిపాటి.  టాంటెక్స్ సంస్థ ప్రమాణాలను మరింత పెంచే దిశగా తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఇందుకు కార్యనిర్వాహక సభ్య బృందము మరియు పాలక మండలి నుండి పూర్తి సహకారాన్ని ఆశిస్తున్నానని అన్నారు.

 ఎన్నికైన నూతన కార్యవర్గము:

 అధ్యక్షుడు : చంద్ర శేఖర్ రెడ్డి పొట్టిపాటి

ఉత్తరాధ్యక్షులు:మాధవి లోకి రెడ్డి

ఉపాధ్యక్షులు:ఉదయ్ కిరణ్ నిడిగంటి

కార్యదర్శి: దీప్తి సూర్యదేవర

 సంయుక్త కార్యదర్శి:దీపికా రెడ్డి

కోశాధికారి : విజయ్ సునీల్ సూరపరాజు

 సంయుక్త కోశాధికారి: లక్ష్మీ నరసింహ పోపూరి

తక్షణ పూర్వాధ్యక్షులు: సతీష్ బండారు

కార్య వర్గ సభ్యులు:  శ్రీయుతులు లక్ష్మి ఎన్ కోయ ,అర్పిత ఓబులరెడ్డి,స్రవంతి ఎర్రమనేని,రఘునాధరెడ్డి కుమ్మెత,ఆర్ బీ ఎస్ రెడ్డి,శివారెడ్డి వల్లూరు,రవి కదిరి,వీర లెనిన్ తుళ్లూరు,అనిత ముప్పిడి,చైతన్య రెడ్డి గాదె,పార్ధసారథి గొర్ల,శాంతి నూతి,రాజా ప్రవీణ్ బాలిరెడ్డి.

పాలక మండలి బృందము:

 అధిపతి : డాక్టర్ కొండా తిరుమల రెడ్డి

ఉపాధిపతి:దయాకర్ మాడ

సభ్యులు : శ్రీ యుతులు సురేష్ మండువ, డాక్టర్ శ్రీనాధ వట్టం, హరి సింగం, జ్యోతి వనం, డాక్టర్ శ్రీనాధ రెడ్డి పలవల

 క్రొత్త పాలక మండలి మరియు కార్యవర్గ బృందాల సూచనలు సహాయ సహకారాలతో సరికొత్త ఆలోచనలతో 2025 లో అందరినీ అలరించే మంచి కార్యక్రమాలు చేయనున్నామని స్థానికంగా ఉన్న తెలుగు వారి ఆశీస్సులు ఆదరణ ఉంటాయని ఆశిస్తున్నానని సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి అన్నారు .పదవీ విరమణ చేస్తున్న తక్షణ పూర్వాధ్యక్షులు సతీష్ బండారు మాట్లాడుతూ చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి నేతృత్వంలో ఏర్పడిన 2025 కార్యవర్గ బృందము నిర్వహించబోయే కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాల్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.అదేవిధంగా 2024 పాలక మండలి అధిపతి సురేష్ మండువ యువత భాగస్వామ్యాన్ని పెంచి టాంటెక్స్ ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలను నిర్వ హించాలని సూచించారు. పాలకమండలి 2024 ఉపాధిపతి హరి సింగం క్రొత్త టీమును అభినందించి ప్రతి కార్య్రక్రమానికి పాలక మండలి సభ్యుల మద్దతు ఉంటుందని తెలిపారు.

చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన  నమస్తే NRI కీ కృతజ్ఞతా పూర్వక అభినందనలు తెలియ చేశారు. 2025 పాలక మండలి అధిపతి డాక్టర్ కొండా తిరుమల రెడ్డి టాంటెక్స్ చేపట్టే అన్ని కార్యకలాపాలకు బోర్డు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.అలాగే ఉపాధిపతి దయాకర్ మాడా మొత్తం టీమ్ ని అభినందించి అన్ని కార్యకలాపాలకు బోర్డు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. వందన సమర్పణతో సమావేశం ముగిసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress