Namaste NRI

అమెరికాలో కలకలం.. జో బైడెన్ కు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్ లోని వాహనాన్ని ఓ ప్రైవేట్ కారు ఢీకొట్టింది. ఈ భద్రతా వైఫల్య సంఘటన అమెరికాలో కలకలం రేపింది. జోబైడెన్, ఆయన సతీమణి జిల్ ఆదివారం రాత్రి 8.9 గంటలకు డెలావర్ లోని విల్మింగ్టన్‌లో ఉన్న తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిన్నర్ ముగించుకుని ఆఫీస్‌బయట ఉన్న కాన్వాయ్ వద్దకు వారు వస్తుండగా ఓ కారు వేగంగా దూసుకొచ్చి కాన్వాయ్ లోని యూఎస్ సీక్రెట్ సర్వీస్ వాహనాన్ని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా మరో వాహనం పైకి దూసుకెళ్ల బోయింది.

ఆ సమయంలో జిల్ బైడెన్ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండగా, జోబైడెన్ వాహనానికి కేవలం 130 అడుగుల దూరంలోనే ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బైడెన్‌ను వేగంగా అధ్యక్ష వాహనం లోకి తీసుకెళ్లారు. ఈ సంఘటనకు పాల్పడిన వాహనాన్ని సీక్రెట్ సర్వీస్ సిబ్బంది చుట్టుముట్టి ఆ డ్రైవర్‌ను అదుపు లోకి తీసుకున్నారు. బైడెన్ దంపతులను వెంటనే వైట్‌హౌస్‌కు తరలించినట్టు అధికారులు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events