అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్‌హౌస్‌లో కొకైన్ కలకలం సృష్టించింది. తెలుపు రంగులో ఉన్న ఓ పదార్థాన్ని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గుర్తించారు. దీన్ని పరిశీలించిన ఎమర్జెన్సీ సర్వీస్ అధికారులు కొకైన్‌గా ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ పదార్థంపై నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు మరిన్ని పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు. దాన్ని మరిన్ని పరీక్షలు చేసేందుకు పంపించారు. అయితే కొకైన్ వైట్‌హౌస్ లోపలికి ఎలా వచ్చిందనేది ఇంకా తెలియలేదు. దానిపై అధికారులు విచారణ చేస్తున్నారు.


