సాత్విక్‌వర్మ, జాక్ రాబిన్‌సన్, మంజీరా రెడ్డి, అమీర్తా హాల్దర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం చిక్లెట్స్. ముత్తు. యం దర్శకుడు. హీరో రామ్ కార్తీక్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ చిక్లెట్స్ ట్రైలర్ చాలా బాగుంది. ఇందులో నటించిన వారి స్క్రీన్ ప్రెజెంటేషన్ బాగుంది. 2కె జనరేషన్ అని పెట్టారు. ఇప్పుడున్న జనరేషన్ అందరూ మోర్ రెస్పాన్స్ బిలిటీ గా ఉన్నారు.వారికీ ఏది కావాలి, ఏది వద్దు అని పూర్ మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారు. పిల్లలకు పేరెంట్స్ కు మంచి మెసేజ్ ఉండేలా తెరకెక్కిన ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ తల్లిదండ్రులందరూ పిల్లల కెరీర్ గురించే ఆలోచిస్తారు. పిల్లలు కూడా తల్లిదండ్రులంటే ప్రేమాభిమానాలతో ఉంటారు. అయితే వారికి ఓ వయసు వచ్చాక పేరేంట్స్‌తో విభేదించడం మొదలుపెడతా రు. అంతిమంగా పిల్లలకు ధైర్యాన్నిచ్చి ప్రయోజకుల్ని చేసేది తల్లిదండ్రులే అనే అంశాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. సెంటిమెంట్‌తో పాటు సందేశం కూడా ఉంటుంది అన్నారు. తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని నిర్మాత శ్రీనివాసన్ పేర్కొన్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి కెమెరా: కొల్లంజి కుమార్, సంగీతం: బాల మురళి బాలు.