Namaste NRI

తానా ఆధ్వర్యంలో బాల సాహిత్య భేరి

బాలల దినోత్సవాన్ని (నవంబర్ 14) పురస్కరించుకుని తానా సాహిత్య విభాగం, తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాల సాహిత్య భేరి ని నిర్వహిస్తుంది. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా బాల సాహితీవేత్తలకు ఆహ్వానం పలుకుతోంది. 2025, నవంబర్ 30వ తేదీన బాల సాహిత్య భేరి పేరుతో అంతర్జాతీయ అంతర్జాల శతాధిక బాల కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నామని తానా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కార్యక్రమంలో విశ్వవ్యాప్తంగా ఉన్న బాల, బాలికలు, కథ, వచన కవిత, గేయం, పద్యం తదితర విభాగాల్లో తమ స్వీయ రచనలను వినిపించాలని సూచించింది.

ఒక్కొక్కరికి 3 నిమిషాల సమయం కేటాయించినట్లు వివరించింది. 5 నుంచి 15 సంవత్సరాల గల బాల, బాలికలు, పైన తెలిపిన విభాగాల్లో ఏదో ఒక అంశానికి సంబంధించి ఒక పేజీ మించకుండా రాయాలని కోరింది. అలాగే వారి పేరు, ఊరు, తరగతి, దేశం, ఫోన్ , తదితర వివరాలను +91 9121081595 వాట్సాప్ నంబర్‌కు గడువులోపు అంటే, నవంబర్ 14వ తేదీలోపు పంపాలని తానా స్పష్టం చేసింది.  ఈ ఎంపికైన విద్యార్థులకు నవంబర్ 30వ తేదీన తానా అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని పేర్కొంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభమై,  రాత్రి 10 గంటల వరకు అంటే 13 గంటలపాటు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుందని చెప్పింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనే బాల, బాలికలకు ప్రశంసా పత్రాలు అందజేస్తామని తానా అధ్యక్షుడు డా.నరేన్ కొడాలి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events