వరుణ్ ధావన్, కృతీ సనన్ జంటగా అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భేదియా. దినేష్ విజన్ నిర్మించారు. సచిన్ జిగర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని చిలిపి వరాలే ఇవ్వు.. అంటూ సాగే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. అమితాబ్ భట్టాచార్య`యనమండ్ర రామకృష్ణ సాహిత్యం అందించిన ఈ పాటని కార్తీక్ పాడారు. హారర్, కామెడీ చిత్రమిది. చిలిపి వరాలే ఇవ్వు పాట చాలా బాగుంటుంది అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళంలో ఈ నెల 25న విడుదల కానుంది. నిర్మాత అల్లు అరవింద్ భేదియా ని తెలుగులో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్నారు.