తైవాన్‌లో క్షిపణి రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు అమెరికా 10 కోట్ల డాలర్ల విలువైన కాంట్రాక్టుకు ఆమోదం తెలిపింది. ఇంజినీరింగ్, నిర్వహణ పనులకు సంబంధించి ఈ ఒప్పందం పై చైనా మండిపడిరది. దీనివల్ల తమ సార్వభౌమ, భద్రతా ప్రయోజనాలు దెబ్బతింటాయని, తైవాన్ జలసంధి ప్రాంతంలో శాంతికి విఘాతం కలుగుతుందని స్పష్టం చేసింది. అందువల్ల కాంట్రాక్టును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. తాజా కాంట్రాక్టు కింద తైవాన్ వద్ద ప్రస్తుతం ఉన్న గగనతల రక్షణ క్షిపణులు, అమెరికా నుంచి సమకూర్చుకోనున్న అధునాతన పేట్రియాట్ క్షిపణుల నిర్వహణకు అగ్రరాజ్యం నుంచి తోడ్పాటు అందుతుంది. తైవాన్‌ను తన అంతర్భాగంగా చైనా పరిగణిస్తోంది. బలప్రయోగం ద్వారానైనా దాన్ని తమ దేశంలో విలీనం చేసుకుంటామని హెచ్చరిస్తోంది. వింటర్ ఒలింపిక్స్‌కు చైనా అతిథ్యమిస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడిరది.














