చైనా విధించిన విధానాన్ని అంగీకరించే విధంగా నిర్బంధించడానికి వీల్లేకుండా రక్షణ రంగాన్ని పటిష్టపరచడం కొనసాగిస్తామని తైవాన్ ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్‌వ్ఖెన్ చెప్పారు. నేషనల్ డే సందర్భంగా త్సాయ్ మాట్లాడుతూ తైవాన్ ప్రజలు ఒత్తిడికి తలొగ్గుతారనే భ్రమలు ఎంతమాత్రం ఉండకూడదన్నారు. చైనాతో సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. తాము దురుసుగా వ్యవహరించబోమన్నారు. తమ జాతీయ భద్రత, రక్షణలను మరింత బలోపేతం చేసుకోవడానికి కృషిని కొనసాగిస్తామని తెలిపారు. తైవాన్ కోసం చైనా ఏర్పాటు చేసిన మార్గంలోనే నడిచే విధంగా తమను ఎవరూ నిర్బంధించడానికి వీల్లేకుండా తమను తాము కాపాడుకోవడం కోసం తమ దృఢ నిశ్చయాన్ని ప్రదర్శిస్తూనే ఉంటామన్నారు. దీనికి కారణాలను వివరిస్తూ, చైనా తమకోసం ప్రకటించిన విధానం ప్రకారం, తైవాన్ ప్రజలు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు, ప్రజాస్వామిక జీవన విధానంలో జీవించే అవకాశం లేదన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)