
అమెరికా రెండు అంశాల్లో తప్పుడు విధానాలు అవలంభిస్తోందని ఆరోపిస్తూ చైనా ఒకేసారి రెండు దర్యాప్తులు మొదలుపెట్టింది. స్పెయిన్ లోని మాడ్రిడ్ లో రెండు దేశాల మధ్య చర్చలు మొదలుకానున్న వేళ ఇది జరగడం గమనార్హం. మాడ్రిడ్ సమావేశంలో జాతీయ భద్రత, టిక్‌టాక్ సోషల్ మీడియా యాజమాన్య హక్కుల వంటివి చర్చకు రానున్నాయి. అమెరికా సెమీకండెక్టర్లను లక్ష్యంగా చేసుకుని చైనా ఈ దర్యాప్తులు చేపట్టింది. కొన్ని ఐసీ చిప్స్‌లో అమెరికాపై యాంటీ డంపింగ్ ఇన్వెస్టిగేషన్‌ను మొదలుపెట్టింది. వీటిని అమెరికాలోని టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఆన్ చిప్స్ సంస్థలు తయారు చేస్తుంటాయి. చైనాలో తయారైన సెమీకండెక్టర్లపై అమెరికా వివక్ష చూపుతోందంటూ మరో దర్యాప్తును చేపట్టింది.
















