ప్రపంచంలో అత్యంత ధనిక దేశంగా చైనా కొత్త రికార్డు సృష్టించింది. సంపద సృష్టిలో అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టి నెంబర్ వన్‌గా డ్రాగన్ దేశం అవతరించింది. గడిచిన రెండు దశాబ్ధాల్లో ప్రపంచ సంపదలో చైనా సంపద మూడు రేట్లు పెరిగినట్లు బ్యూమ్‌బెర్గ్‌లోని నివేదిక వెల్లడిరచింది. మెకిన్సే అండ్ కో పరిశోధనా విభాగం 10 దేశాల బ్యాలెన్స్ షీట్లను విశ్లేషించి ఈ నివేదిక అందించినట్లు పేర్కొంది. ప్రపంచం మొత్తం ఆదాయంలో 60 శాతం ఈ పది దేశాల వద్దే ఉన్నట్లు పేర్కొంది. ఆ దేశాల జాబితాలో అమెరికా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, కెనడా ఆస్ట్రేలియా, జపాన్, మెక్సికో, స్వీడన్‌లు ఉన్నాయి.
ప్రపంచ నెట్ వర్త్ 2020లో అనూహ్యంగా 514 ట్రిలియన్ డాలర్లకు చేరిందని, ఇది 2000లో 156 ట్రిలియన్ డాలర్లు అని తెలిపింది. చైనాకు అత్యధిక వాటా లభించిందని, ప్రపంచ ఆదాయంలో దాదాపు మూడో వంతు చైనా సొంతమైందని వివరించింది. ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరడానికి ముందు 2000వ సంవత్సరంలో చైనా సంపద 7 ట్రిలియన్ డాలర్లు ఉండేదని, ప్రస్తుతం ఇది 120 ట్రిలియన్ డాలర్లకు చేరిందని వివరించింది. ఇదే కాలంలో అమెరికా నెట్‌వర్త్ రెట్టింపు (90 ట్రిలియన్ డాలర్లు) అయిందని తెలిపింది. చైనా, అమెరికా ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలని పేర్కొంది.














