Namaste NRI

భారత్‌, అమెరికాకు షాకిచ్చిన చైనా

భారత్‌, అమెరికాకు డ్రాగన్‌ దేశం చైనా మరోసారి బిగ్‌ షాకిచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్‌ రెహ్మాన్‌ మక్కిని గ్లోబల్‌ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని భారత్‌, అమెరికా సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకున్నది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐసిస్‌, ఆల్‌ ఖైయిదా ఆంక్షల కమిటీ కింద ఉగ్రవాది మక్కిని గ్లోబల్‌ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని భారత్‌, అమెరికా ప్రతిపాదన చేశాయి. అయితే ఆ ప్రయత్నాలను చైనా అడ్డుకున్నది. సెప్టెంబర్‌ 26 దాడులకు పాల్పడిన లష్కరే తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ మక్కి సోదరుడవుతాడు. మక్కిని ప్రత్యేకమైన గ్లోబల్‌ టెర్రరిస్ట్‌గా చేస్తూ అమెరికా ట్రెజరీ శాఖ 2010 నవంబర్‌లో ప్రకటన చేసింది. దాని ప్రకారం మక్కీ ఆస్తుల్ని సీజ్‌ చేశారు. అమెరికన్లు ఎవరూ కూడా మక్కితో లావాదేవీలు నిర్వహించరాదు. మక్కి తలపై రెండు మిలియన్ల డాలర్ల రివార్డును కూడా అమెరికా ప్రకటించింది. లష్కరే సంస్థ కోసం నిధులను సమీకరించినట్లు మక్కిపై ఆరోపణలు ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events