Namaste NRI

అమెరికాకు చైనా వార్నింగ్‌

అగ్రరాజ్యం అమెరికాపై చైనా విరుచుకుపడిరది. తమపై నిందలు వేయడం ఆపేయాని, తమను బద్నాం చేయవద్దని సూటిగానే హెచ్చరించింది. ప్రపంచ దేశాల ముందు తమను బద్నాం చేసే పనిలో అమెరికా ఉందని చైనా అధ్యక్షుడు తీవ్రంగా విరుచుకుపడ్డారు. మొత్తం ప్రపంచ వ్యవస్థనే బలహీన పరిచేలా చైనా వ్యవహరిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ విరుచుకుపడ్డారు. ప్రపంచ దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తలెత్తేలా వ్యవహారాలు చేయవద్దని సూటిగానే హెచ్చరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి చైనాను వేరే చేసే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని, అయితే చైనా మాత్రం అంతర్జాతీయ ప్రమాణాలను కచ్చితంగా ఫాలో కావాలని తేల్చి చెప్పింది.

                 అమెరికా విదేశాంగ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతోనే చైనా తీవ్రంగా మండిపడిరది. ఇక ఈ వ్యాఖ్యలకే చైనా కౌంటర్‌ ఇచ్చింది. తమ ప్రతిష్ఠను దిగజార్చొద్దని, తమకు కళంకం తెచ్చేలా వ్యాఖ్యలు చేయవద్దని చైనా విదేశాంగ శాఖ అమెరికాను తీవ్రంగా హెచ్చరించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events