Namaste NRI

చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్.. సంచ‌ల‌న నిర్ణ‌యం

చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అణ్వాయుధ ద‌ళానికి చెందిన ఇద్ద‌రు టాప్ అధికారుల్ని జిన్‌పింగ్  తొల‌గించారు. వారి స్థానంలో ఇద్ద‌రు కొత్త వ్య‌క్తుల్ని నియ‌మించారు. పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీకి చెందిన రాకెట్ ఫోర్స్ యూనిట్ అధిప‌తి జ‌న‌ర‌ల్ లీ యుచేవ్‌ను తొల‌గిస్తూ జిన్‌పింగ్ ఆదేశాలు జారీ చేశారు. యుచేవ్‌తో పాటు ఆయ‌న డిప్యూటీపై కూడా వేటు వేశారు. న్యూక్లియ‌ర్ ఫోర్స్ కోసం మాజీ నేవీ చీఫ్ వాంగ్ హౌబిన్‌, పార్టీ సెంట్ర‌ల్ క‌మిటీ స‌భ్యుడు జూ జిషెంగ్‌ల‌ను నియ‌మిస్తూ అధ్య‌క్షుడు జిన్‌పింగ్ ఆదేశాలు ఇచ్చారు. గ‌త ద‌శాబ్ధ కాలంలో ఇది చైనా మిలిట‌రీలో చోటుచేసుకున్న అతిపెద్ద మార్పు అని విశ్లేష‌కులు చెబుతున్నారు. న్యూక్లియ‌ర్ స్ట్రాట‌జీలో చైనా త‌న విధానాన్ని మార్చుకున్న‌ద‌ని, అందుకే ఆ ద‌ళానికి చెందిన టాప్ నేత‌ల్ని మార్చివేసిన‌ట్లు తెలుస్తోందన్నారు. పీఎల్ఏను అసాధార‌ణ రీతిలో జిన్‌పింగ్ నియంత్రిస్తున్న‌ట్లు నిపుణులు భావిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events