Namaste NRI

మట్కా ట్రైలర్‌ చూసి చిరంజీవి రియాక్షన్‌ ఏంటంటే : వరుణ్‌ తేజ్‌

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా కరుణకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మట్కా. వైర ఎంటర్‌టైన్‌ మెంట్స్‌, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర  ట్రైలర్‌ను అగ్ర నటుడు చిరంజీవి ఆవిష్కరించారు. వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ  నేను మాస్‌ సినిమా చేసి చాలా రోజులైంది. మట్కా పవర్‌ఫుల్‌ స్టోరీ. చిరంజీవిగారికి ట్రైలర్‌ బాగా నచ్చింది. నా క్యారక్టరైజేషన్‌లో భిన్న కోణాలుంటాయి అన్నారు.  

1950-80 బ్యాక్‌డ్రాప్‌లో ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠను పంచుతూ సాగింది. మట్కా కింగ్‌ వాసు పాత్రలో వరుణ్‌తేజ్‌ కనిపించారు. సర్కస్‌లో బఫూన్స్‌ని చూసి జనమంతా నవ్వుతారు. చప్పట్లు కొడతారు. కానీ ఒక చిన్న కర్ర పట్టుకొని పులుల్ని, సింహాల్ని ఆడించేవాడు ఒకడు ఉంటాడు. అలాంటోడే వీడు. రింగ్‌ మాస్టర్‌ వంటి డైలాగ్స్‌ ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. దర్శకుడు మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశానని తెలిపారు. సినిమా విజయంపై టీమ్‌ అంతా పూర్తి నమ్మకంతో ఉన్నామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ నెల 14న విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌ కుమార్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events