Namaste NRI

చిత్రపురి కాలనీ భవిష్యత్‌లో ఓ ల్యాండ్‌ మార్క్‌

టాలీవుడ్‌కి చెందిన చిత్రపురి కాలనీ నూతన ప్రాజెక్ట్‌, భవిష్యత్‌ కార్యాచరణ వివరాలను సంస్థ సభ్యులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. త్వరలో ప్రాజెక్ట్‌కి సంబంధించిన భూమి పూజ ఉంటుందని సంస్థ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన బ్రోచర్‌ని విడుదల చేశారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా పరిశ్రమలో కార్మికులందరికీ ఇళ్లు అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని వల్లభనేని అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. చిత్రపురి కాలనీ భవిష్యత్‌లో ఓ ల్యాండ్‌ మార్క్‌ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని ఆయన నమ్మకం వెలిబుచ్చారు.

ఈ కార్యక్రమంలో భరతభూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, అనుపమ రెడ్డి, C. కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, తమ్మారెడ్డి భరద్వాజ్, వీర శంకర్, మాదాల రవి, భరద్వాజ్, అమ్మిరాజు, రాజీవ్ కనకాల, దొర, ప్రవీణ్ కుమార్ యాదవ్, లలిత, మహా నంద రెడ్డి, అలహరి, ప్రసాద్ రావు, రామకృష్ణ ప్రసాద్, రఘు బత్తుల, దీప్తి వాజపేయి, అనిత నిమ్మగడ్డ, అలాగే సినిమా యూనియన్ నాయకులు, ఆర్టిస్ట్ లు, 24 ఫ్రేమ్స్ కు సంబంధించి వారు, చిత్రపురి కాలనీ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events