అక్రమ వలసదారులకు పౌరసత్వం లభించకుండా యూకే ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఈ మేరకు యూకే హోం కార్యాలయం ఇమ్మిగ్రేషన్ సిబ్బందికి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అక్రమంగా, ప్రమాదకర ప్రయాణం చేసి యూకేలోకి అడుగుపెట్టే వారికి పౌరసత్వాన్ని ఇవ్వొద్దని ఇందులో స్పష్టం చేసింది. అక్రమ వలసదారులు ఏ రకంగా ప్రయాణించి వచ్చినా దానిని ప్రమాదకర ప్రయాణంగానే భావించి, పౌరసత్వ దరఖాస్తు తిరస్కరించాలని తెలిపింది. ఇప్పటికే అక్రమ వలసదారులు యూకే పౌరసత్వం పొందకుండా నిబంధనలు ఉన్నాయని, తాజా మార్గదర్శకాలతో ఇవి మరింత కఠినతరం అయ్యాయని యూకే హోం కార్యాలయ అధికార ప్రతినిధి తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tulsi-300x160.jpg)