సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ పర్యటన ఖరారైంది. ఈ నెల 23 నుండి జూలై 3వ తేదీ వరకు అమెరికాలో జస్టిస్ రమణ పర్యటించనున్నారు. ఈ నెల 24న న్యూజెర్సీలో జరిగే తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా, 25న వర్జీనియాలో తెలుగు కమ్యూనిటీ ఆఫ్ వాషింగ్టన్ డీసీ ఆధ్వర్యంలో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. జులై 1న సీజేఐ గౌరవార్థం మిల్పిటాస్‌లో అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రవాసా భాతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా న్యూజెర్సీ, వర్జీనియా, కాలిఫోర్నియా రాష్ట్రాలను సందర్శిస్తారు. స్థానికంగా ఉన్న భారతీయ సంఘాలు, తెలుగు సంఘాల ప్రతినిధులతో ఆయన భేటీ అవుతారు.














