Namaste NRI

అమెరికాలో మరో యూనివర్సిటీతో సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందం

తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అమెరికా పర్యటన విజయవంతంగా   కొనసాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాలోని బడా కంపెనీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటోంది. తాజాగా,  కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. స్టాన్ ఫోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సమావేశ మైంది. ఈ సందర్భంగా హెల్త్ కేర్‌లో కొత్త ఆవిష్కరణలు, విద్య, నైపుణ్య అభివృద్ధి అంశాలపైనే ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, న్యూ లైఫ్ సైన్సెస్ యూని వర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రభుత్వం వారిని ఆహ్వానించింది. పరస్పరం అధునాతన పరిజ్ఞానా న్ని పంచుకునే కార్యక్రమాలతో పాటు ఉమ్మడిగా పరిశోధనలు నిర్వహించాలనే అభిప్రాయాలు ఈ సమావేశం లో వ్యక్తమయ్యాయి.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్టాన్‌ఫోర్డ్ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీతో భాగస్వామ్యం పంచుకోవటం రాష్ట్ర యువత భవితకు కొత్త బాటలు వేస్తుందని చెప్పారు. హెల్త్ కేర్ రంగంలో యువతకు నైపుణ్యాల అభివృద్ధిని అందించేందుకు స్టాన్‌ఫోర్డ్ భాగస్వామ్యం కోరినట్లు తెలిపారు. ఇప్పటికే దేశంలో పరిశ్రమలు, కొత్త ఆవిష్కరణల్లో రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పారు. స్టాన్‌ఫోర్డ్ బయోడిజైన్ లాంటి ప్రపంచ స్థాయి విభాగాలు కలిసి వస్తే స్కిల్స్ డెవెలప్మెంట్‌లో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం ఒక్క తెలంగాణ వృద్ధికే కాకుండా.. యావత్ ప్రపంచానికి హెల్త్ కేర్ రంగంలో కీలకంగా నిలుస్తుందని అన్నారు. స్టాన్ ఫోర్డ్ భాగస్వామ్యంతో తెలంగాణలో ఏర్పాటయ్యే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీల లక్ష్యం నెరవేరుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణలో లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ పరిశ్రమల వృద్ధికి మరో ముందడుగు పడుతుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress