Namaste NRI

క‌న్న‌ప్ప రిలీజ్ డేట్ పోస్టర్ ఆవిష్కరించిన  సీఎం యోగి ఆదిత్యనాథ్‌

మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా నటిస్తున్న చిత్రం క‌న్న‌ప్ప. ఈ సినిమాను క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహ‌న్ బాబు నిర్మిస్తున్నారు.  హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తార‌లు న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. అయితే తాజాగా ఈ మూవీ విడుద‌ల తేదీని మ‌ళ్లీ ప్ర‌క‌టించారు మేక‌ర్స్.

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను  క‌లిసిన క‌న్న‌ప్ప టీం,  యోగి చేతుల మీదుగా కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. ఈ మూవీని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. రిలీజ్ డేట్ పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం సీఎం యోగి మూవీ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events