ద్రవిడ భూమి ఆత్మగౌరవ నినాదంతో రూపొందిస్తున్న చిత్రం కోడ్ రామాయణ. స్వీయ దర్శకత్వంలో రచయిత సౌద అరుణ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు సౌద అరుణ మాట్లాడుతూ ద్రవిడ భూమి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే లక్ష్యంతో జై శ్రీ రావణ్ నినాదంతో ఈ సినిమా తీశాం. కోడ్ రామాయణ అంటే రామాయణ అంతరార్థం అని అర్థం. ఈ సినిమాలో ఏ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే భావజాలం ఉండదు. మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. ఇందులో యాభై మంది నటీనటులు నటించారు అన్నారు.


