ప్రపంచ స్థాయిలో ఐటి రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణ లో భారీ విస్తరణ ప్రణాళికకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇరవై వేల మంది ఉద్యోగులుండేలా పది లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్ ను స్థాపించనుంది.
అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల సందర్భంగా ఈ ఒప్పందం జరిగింది. అభివృద్దిపథంలో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఉపాధి, ఉద్యోగ, వ్యాపార రంగాల కు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇప్పుటికే కొత్త సంస్థలు, ఐటీ కంపెనీల రాకతో ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇందులో భాగంగానే మరో 15 వేల మందికి ఉపాధి కల్పించేందుకు కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ను హైదరాబాద్ లో ప్రారంభిచనుంది.